శుక్రవారం 23 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 11:49:26

కర్ణాటక ఉప ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్‌

కర్ణాటక ఉప ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్‌

బెంగళూరు : కర్ణాటకలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. సామాన్యులతో పాటు రాజకీయ నాయకులు, ప్రముఖులు వైరస్‌ బారినపడుతున్నారు. ఇప్పటికే సీఎంతో పాటు పలువురు మంత్రులు మహమ్మారి బారినపడి కోలుకోగా.. తాజాగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గోవింద్ ఎం కర్జోల్ వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించారు. లక్షణాలు లేనప్పటికీ.. వైద్యుల సలహా మేరకు హాస్పిటల్‌లో చేరినట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేసుకోవడంతో పాటు నిర్బంధంలో ఉండాలని సూచించారు. ఇంతకు ముందు ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మరో ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ్, హోంమంత్రి బసవరాజ్ బొమ్మాయి, అటవీ మంత్రి ఆనంద్ సింగ్, పర్యాటక మంత్రి సీటీ రవి, వ్యవసాయ మంత్రి బీసీ పాటిల్, అలాగే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం కరోనా వైరస్ పాజిటివ్ పరీక్షించారు. ప్రస్తుతం వారంతా కోలుకున్నారు. ఇదిలా ఉండగా కర్ణాటకలో ఇప్పటి వరకు 5,26,876 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో 95,335 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 4,23,377 డిశ్చార్జి కేసులుండగా, వైరస్‌ ప్రభావంతో 8145 మంది మృత్యువాతపడ్డారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo