బుధవారం 15 జూలై 2020
National - Jun 27, 2020 , 16:49:07

రెండు ర‌కాల ఐస్‌క్రీమ్‌ల‌ను రిలీజ్ చేసిన డెయిరీ.. ఇవి తిన‌డానికేనా?

రెండు ర‌కాల ఐస్‌క్రీమ్‌ల‌ను రిలీజ్ చేసిన డెయిరీ.. ఇవి తిన‌డానికేనా?

ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యాన్ని అస‌లు జీర్ణించుకోలేరు. ఐస్‌క్రీమ్‌లంటే అంద‌రికీ ఇష్టమే. ఇష్టం లేని వాళ్లంటూ ఉండ‌రు. అలాగే క‌రోనా వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతుండటంతో  పిల్ల‌ల‌కు రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే నేప‌థ్యంలో క‌ర్ణాట‌కలోని డెయిరీ డే సంస్థ రెండు ర‌కాల ఐస్‌క్రీమ్‌ల‌ను రిలీజ్ చేసింది. అందులో మొద‌టిది చ్యావాన్‌ప్రాష్. దీన్ని చిన్న‌ప్పుడు చాలామంది టేస్ట్ చేసి ఉంటారు. ఇది కొంచెం వ‌గురుగా ఉంటుంది. అందుక‌ని పిల్ల‌లు తిన‌మంటూ మారం చేస్తుంటారు. దీన్ని డైరెక్ట్‌గా తిన‌లేరు కాబ‌ట్టి ఐస్‌క్రీంలో వేసి త‌యారు చేశారు. దీంతోపాటు తేనె, ఖ‌ర్జూరం కూడా వేశారు.

అలాగే రెండ‌వ‌ది. పసుపు, చింతపండు, తేనె కలిపిన ఐస్ క్రీం‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెర‌గుతుంద‌ని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా ఐస్‌క్రీమ్‌లను మార్కెట్లోకి తెస్తున్నామని డెయిరీ ప్రకటించింది. ఈ సందర్భంగా సోష‌ల్‌మీడియాలో పోస్టుచేసిన ప్రకటన వైరల్‌‌గా మారింది. అంతేకాదు ఫ్యాక్ట‌రీలోని కార్మికులు ఐస్‌క్రీం ప్యాకేజింగ్ చేస్తున్న‌ట్లుగా వీడియోలో చూపించారు. ఇప్పుడు ఈ ఐస్‌క్రీమ్‌ల‌ను నెటిజ‌న్లు జీర్ణించుకోలేక పోతున్నారు. ఏడుస్తున్న ఈమోజీలు పెడుతూ వారి బాధ‌ను వ్య‌క్తం చేస్తున్నారు. 'మీరు చ్య‌వాన్‌ప్రాష్ లేదా హ‌ల్ది ఐస్‌క్రీం ప్ర‌య‌త్నించ‌డానికి సిద్ధంగా ఉన్నారా' అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.  ఈ వీడియో చూస్తే పూర్తిగా అర్థ‌మ‌వుతుంది. 

      

తాజావార్తలు


logo