బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 25, 2020 , 19:30:41

కర్ణాటకలో 8 లక్షలు దాటిన కరోనా కేసులు

కర్ణాటకలో 8 లక్షలు దాటిన కరోనా కేసులు

బెంగళూరు: కర్ణాటకలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉన్నది. కరోనా కేసుల సంఖ్య ఎనిమిది లక్షల మార్కును దాటింది. ఆ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా నిత్యం వేలల్లో  పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 4,439 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 32 మంది వైరస్ వల్ల మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,02,817కు, మరణాల సంఖ్య 10,905కు చేరింది. మరోవైపు గత 24 గంటల్లో కర్ణాటకలో 10,016 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 7,10,843కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 81,050 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.