శుక్రవారం 05 జూన్ 2020
National - May 16, 2020 , 10:58:23

వచ్చేనెల 6 వరకు జిల్లా కోర్టులు బంద్‌

వచ్చేనెల 6 వరకు జిల్లా కోర్టులు బంద్‌

బెంగళూరు: కర్ణాటకలోని జిల్లా కోర్టులు వచ్చే నెల ఆరో తేదీవరకు మూసి ఉండనున్నాయి. రాష్ట్రంలోని జిల్లా కోర్టులతో సహా ఫ్యామిలీ కోర్టులు, లేబర్‌ కోర్టులు, ఇండస్ట్రియల్‌ ట్రిబ్యునళ్లు జూన్‌ 6 వరకు మూసి ఉంటాయని రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజేంద్ర బదామికర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించడానికి లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో కోర్టులు ఈ రోజువరకు మూసి ఉంటాయని గతంలో ప్రకటించారు. అయితే నేటితో ఆ గడువు పూర్తవుతుండటంతో మరోమారు కోర్టులకు సెలవులు ప్రకటించారు. 

కర్ణాటకలో ఇప్పటివరకు 987 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 35 మంది మరణించారు. మరో 460 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.


logo