రోడ్డు ఊడ్చాలని పోలీసు ఆఫీసర్‌కు కోర్టు ఆదేశం

బెంగళూరు : ఓ కిడ్నాప్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసు ఆఫీసర్‌కు కర్ణాటక హైకోర్టు శిక్ష విధించింది. శిక్ష ఏంటంటే.. వారం రోజుల పాటు తాను విధులు నిర్వర్తిస్తున్న పోలీసు స్టేషన్ ఎదుట ఉన్న రోడ్డును ఊడ్చాలని ఆదేశించింది కోర్టు. సురేశ్ అనే యువకుడు ఈ ఏడాది అక్టోబర్ 20న అదృశ్యమయ్యాడు. దీంతో సురేశ్ తల్లి తారాబాయి కలబురాగిలోని బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దీంతో విసిగిపోయిన తారాబాయి.. కర్ణాటక హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఎఫ్ఐఆర్ నమోదు చేయనుందుకు స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌కు శిక్ష విధించింది. డిసెంబర్ 17వ తేదీన కోర్టు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వారం రోజుల పాటు పోలీసు స్టేషన్ ముందు ఉన్న రోడ్డును ఊడ్చాలని కోర్టును ఎస్‌హెచ్‌వోను ఆదేశించింది. సురేశ్ ఆచూకీ ఇంకా తెలియలేదు. కోర్టు ఆదేశాలతో సురేశ్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే జీరో ఎఫ్ఐఆర్పై అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్ లేదా ఓరియంటేషన్ తరగతులు నిర్వహించాలని జిల్లా ఎస్పీని కోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
- రామ మందిరానికి వజ్రాల వ్యాపారుల రూ.17 కోట్ల విరాళాలు
- ఆఫ్ఘన్లో కారుబాంబు పేలుడు:35 మంది మృతి
- ఇండోనేషియాలో భూకంపం, 42 మంది మృతి
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయావతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్‌తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ