కర్ణాటక మండలి డిప్యూటీ చైర్మన్ ఆత్మహత్య

చిక్‌మగళూరు జిల్లాలో రైలు పట్టాలపై ఎస్ఎల్ ధర్మేగౌడ మృతదేహం గుర్తింపు
సభలో అవమానం నేపథ్యంలో అఘాయిత్యం
బెంగళూరు: కర్ణాటక శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్ఎల్ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకున్నారు. చిక్‌మగళూరు జిల్లాలోని గుణసాగర వద్ద రైలు పట్టాలపై ధర్మేగౌడ మృతదేహాన్ని మంగళవారం ఉదయం గుర్తించారు. మృతదేహం వద్ద ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా ఉన్న లేఖ లభించిందని పోలీసులు తెలిపారు. అయితే అందులో ఏముందనేది బయటపెట్టలేదు. ఈ నెల 15న సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య జరిగిన గొడవలో.. చైర్మన్ స్థానంలో ఉన్న ధర్మేగౌడను కొందరు సభ్యులు కిందికి లాగేసిన విషయం తెలిసిందే. ధర్మేగౌడకు భార్య ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) పార్టీ నుంచి ధర్మేగౌడ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
డ్రైవరకు కూడా చెప్పకుండా..
శాసన మండలిలో గొడవ జరిగిన నాటి నుంచి ఎవరితోనూ కలువకుండా ముభావంగా ఉంటున్న ధర్మేగౌడ.. సోమవారం సాయంత్రం సఖరయపట్టణలోని తన ఫామ్‌హౌజ్ నుంచి ఎవరికీ చెప్పకుండా కారులో బయటకు వెళ్లిపోయారు. డ్రైవర్‌ను కూడా తనతో తీసుకెళ్లలేదు.
గొప్ప నేతను కోల్పోయాం..
ధర్మేగౌడ మృతితో గొప్ప నాయకున్ని కోల్పోయామని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవేగౌడ ఆవేదన వ్యక్తంచేశారు. ధర్మేగౌడ ఆత్మహత్య తనను కలచివేసిందని కర్ణాటక సీఎం బీఎస్ యెడియూరప్ప సంతాపం తెలిపారు.
తాజావార్తలు
- చిన్న పరిశ్రమలకు ‘ఆలీబాబా’:డిజైన్‌పై ఫోకస్!
- జలుబు చేసినప్పుడు పెరుగు తింటున్నారా..
- స్ట్రాబెర్రీస్ తినడానికి చాలా కారణాలున్నాయ్.!
- తెలంగాణ సీఐ సృజన్‌రెడ్డికి జీవన్ రక్షా అవార్డు
- రైతన్నలకు శాల్యూట్ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
- ఆన్ లైన్ లో అమ్మకానికి బిడ్డ ...!
- బొలెరో వాహనం బోల్తా.. 15 మందికి గాయాలు
- బడ్జెట్ రోజున.. పార్లమెంట్ వైపు దూసుకెళ్తాం: రైతులు
- ఈ మందు టేస్ట్ సూపర్ గురూ..!
- రజినీకాంత్ 'అన్నాత్తే' రిలీజ్ డేట్ ఫిక్స్..!