మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Sep 24, 2020 , 17:05:18

కరోనాతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కన్నుమూత

కరోనాతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కన్నుమూత

బెంగళూరు: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కరోనాతో మరణించారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలోని బసవకళ్యాణ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బీ నారాయణరావు (65) గురువారం మధ్యాహ్నం ప్రైవేట్‌ దవాఖానలో చనిపోయారు. ఈ నెల 1న ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో బెంగళూరులోని మణిపాల్‌ ఆసుపత్రిలో చేరారు. అయితే ఎమ్మెల్యే నారాయణ రావుకు కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నదని, ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు ఆ దవాఖాన డైరెక్టర్‌ మనీశ్‌ రాయ్‌ బుధవారం తెలిపారు. కాగా గురువారం నారాయణ రావు ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించడంతో మధ్యాహ్నం 3.55కు చనిపోయినట్లు మణిపాల్‌ హాస్పిటల్స్ యాజమాన్యం వెల్లడించింది. కర్ణాటకలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ఎమ్మెల్యే నారాయణ రావు మరణ వార్త తెలిసింది. దీంతో ఆయనకు నివాళిగా సభను కొంతసేపు వాయిదా వేశారు. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5.34 లక్షలు దాటగా 8 వేల మందికిపైగా మరణించారు.
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo