శనివారం 04 జూలై 2020
National - Jun 28, 2020 , 14:26:37

పెట్రో ధరల పెంపుపై దేశవ్యాప్తంగా నిరసన..

పెట్రో ధరల పెంపుపై దేశవ్యాప్తంగా నిరసన..

బెంగళూరు: రోజురోజుకూ పెట్రో ధరలు పెరుగుతుండడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ నెల 29న  సైకిల్‌ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ వెల్లడించారు. శివకుమార్‌ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ ర్యాలీ అన్ని జిల్లా కేంద్రాలతోపాటు బెంగళూరులోని కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయం వద్ద చేపడుతామని తెలిపారు.  అందరూ కార్యాలయానికి సైకిల్‌పైనే రావాలని, తనతోపాటు సిద్ధరామయ్య కూడా అలాగే వస్తారని పేర్కొన్నారు. 

కాగా, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సైకిల్‌యాత్రలో పాల్గొన్నారు. అలాగే, బీహార్‌ రాజధాని పాట్నాలో రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) నేతలు తేజస్వీ యాదవ్‌, తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ కూడా తమ పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి సైకిల్‌యాత్ర నిర్వహించారు. శనివారం వరకు వరుసగా 21 రోజులు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. logo