గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 15:58:41

క‌ర్ణాట‌క సీఎంకు గోక‌క్ కోర్టు స‌మ‌న్లు

క‌ర్ణాట‌క సీఎంకు గోక‌క్ కోర్టు స‌మ‌న్లు

బెంగ‌ళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్‌ యెడియూరప్పకు గోకక్‌లోని ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. 2019లో గోకక్‌ శాసనసభ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన‌ ఉపఎన్నికల ప్రచారం సంద‌ర్భంగా యెడియూర‌ప్ప ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ దాఖ‌లైన పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన‌ న్యాయ‌స్థానం ఈ మేర‌కు స‌మ‌న్లు ఇచ్చింది. ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా యెడియూర‌ప్ప రెండుసార్లు కులం ప్ర‌స్తావ‌న తెచ్చార‌ని, అది ఎన్నిక‌ల నియ‌మావ‌ళికి విరుద్ధ‌మ‌ని, అలా ఎందుకు చేయాల్సి వ‌చ్చిందో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోర్టు స‌మ‌న్ల‌లో పేర్కొన్న‌ది.   

గోకక్ నియోజకవర్గం ఉపఎన్నిక సంద‌ర్భంగా గ‌త ఏడాది న‌వంబ‌ర్ 23న‌ ముఖ్య‌మంత్రి యెడియూర‌ప్ప బీజేపీ అభ్య‌ర్థి ర‌మేశ్ జ‌ర్ఖిహోలీ త‌ర‌ఫున ప్ర‌చారానికి వెళ్లారు. ఆ ప్ర‌చారంలో ఓట‌ర్ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. రెండుసార్లు కులం ప్రస్తావ‌న తెచ్చారు. వీర‌శైవ లింగాయ‌త్‌ల ఓట్లు చీలిపోకుండా చూసుకోవాల‌ని ఓట‌ర్ల‌ను కోరారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్ర‌చారంలో కులం ప్ర‌స్తావ‌న తీసుకురావ‌డం ద్వారా యెడియూర‌ప్ప ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించార‌ని ఆరోపించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo