National
- Nov 28, 2020 , 07:22:50
సీఎం రాజకీయ కార్యదర్శి సంతోష్ ఆత్మహత్యాయత్నం

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప రాజకీయ కార్యదర్శి ఎన్ఆర్ సంతోష్ ఆత్మహత్యాయత్నం చేశారు. సంతోష్ నిన్న నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి ప్రయత్నించాడు. దీంతో ఆయనను బెంగళూరులోని రామయ్య మెమోరియల్ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉన్నదని దవాఖానవర్గాలు వెల్లడించాయి. అయితే ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
కాగా, తన రాజకీయ కార్యదర్శి ఆత్యహత్యకు పాల్పడిన ఘటనపై సీఎం యెడియూరప్ప స్పందించారు. తాను సంతోష్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతానని ప్రకటించారు. ఆయన ఎందుకు అలా చేసుకున్నాడనే విషయం తనకూ తెలియదని చెప్పారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారని, ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీలేదన్నారు. దవాఖానలో చికిత్స పొందుతున్న సంతోష్‌ను సీఎం పరామర్శించారు.
తాజావార్తలు
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి దరఖాస్తుల స్వీకరణ
- మెట్రో వెంచర్.. ఆదాయంపై ఫోకస్
- రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్
- ముదిరాజ్‌ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
- బోగస్ గుర్తింపు కార్డులతో చిత్రపురి కాలనీలో ఫ్లాట్లు
- వివిధ కారణాలతో పలువురి ఆత్మహత్య
- సీసీ కెమెరాలు పట్టించాయి..
- సౌర విద్యుత్‌పై గ్రేటర్ వాసుల ఆసక్తి
- భరోసాతో బడికి
- ఈ రాశులవారికి.. ఆకస్మిక ధనలాభం
MOST READ
TRENDING