మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 14, 2020 , 21:40:38

ప‌నిచేయ‌క‌పోతే ప‌నిష్‌మెంటే: క‌ర్ణాట‌క సీఎం

ప‌నిచేయ‌క‌పోతే ప‌నిష్‌మెంటే: క‌ర్ణాట‌క సీఎం

బెంగ‌ళూరు: కరోనా మ‌హ‌మ్మారి కట్టడిపై స‌రిగా శ్రద్ధపెట్టని మున్సిపల్ సిబ్బంది, ఆరోగ్యశాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప హెచ్చరించారు. కరోనా నియంత్రణ కోసం తీసుకోవాల్సిన‌ చర్యలపై మాట్లాడిన సంద‌ర్భంగా క‌ర్ణాట‌క సీఎం ఈ హెచ్చ‌రిక‌లు చేశారు. బాధ్యతలు నిర్వహించడంలో విఫలమైతే  అధికారులపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. అంబులెన్సులు, ఆస్పత్రిలో బెడ్లు అందుబాటులేంటూ ప్రభుత్వానికి అందుతున్న ఫిర్యాదుల విషయాన్ని కూడా ఆయ‌న‌ ప్రస్తావించారు. 

బెడ్లు ఖాళీ లేవంటూ రోగులను తిప్పి పంపిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై క‌ఠిన‌ చర్యలు తీసుకోవాలని యెడియూర‌ప్ప అధికారుల‌ను ఆదేశించారు. కరోనా రిపోర్టుల విషయంలో జరుగుతున్న జాప్యంపై కూడా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 77 ల్యాబ్‌ల‌లో రోజుకు 77 వేల పరీక్షలు జరిపే అవకాశం ఉన్నప్పటికీ రిపోర్టుల విడుదలలో జాప్యం ఎందుకు జరుగుతోందని ఆయన అధికారులను నిలదీశారు. అక్కడి పరిస్థితులన తక్షణమే చక్కదిద్ది, పరీక్షల రిపోర్టులు తొందరగా విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo