ఆదివారం 17 జనవరి 2021
National - Nov 29, 2020 , 00:42:50

కర్ణాటక సీఎం రాజకీయ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

కర్ణాటక సీఎం రాజకీయ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

బెంగళూరు: కర్ణాటక సీఎం యెడియూరప్ప రాజకీయ కార్యదర్శి, ఆయన బంధువు సంతోష్‌ శుక్రవారం తన నివాసంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. స్పృహలో లేకపోవడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించారు. యెడియూరప్ప కూడా దవాఖానకు వెళ్లి సంతోష్‌ ఆరోగ్యంపై ఆరా తీశారు. సంతోష్‌కు ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. తన భర్త  ఆత్మహత్యాయత్నానికి రాజకీయ కారణాలే కారణమని సంతోష్‌ భార్య ఆరోపించారు.