బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 24, 2020 , 16:22:41

వర్షాలపై కర్ణాటక సీఎం అత్యవసర సమీక్ష

వర్షాలపై కర్ణాటక సీఎం అత్యవసర సమీక్ష

బెంగళూరు : బెంగళూరు నగరాన్ని శుక్రవారం భారీ వర్షం ముంచెత్తింది. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునగ్గా.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా సౌత్ బెంగళూరులోని చాలాప్రాంతాలు వర్షానికి అతలాకుతలం అయ్యాయి. మరో రెండురోజులుపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో శనివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్‌ యెడియూరప్ప మంత్రి ఆర్‌ అశోక్‌తోపాటు బెంగళూర్‌ మహానగర పాలిక కమిషనర్‌ మంజునాథ్‌ ప్రసాద్‌తో తన అధికారిక నివాసంలో రాష్ట్రంలో వర్షాలపై అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు.

బాధితులను వెంటనే ఆదుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. బాధిత కుటుంబాలకు రూ.25 వేల సాయం అందించనున్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని రాష్ట్ర మంత్రి ఆర్‌. అశోక్‌ వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నామయని ఆయన పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.