మంగళవారం 07 జూలై 2020
National - Jun 18, 2020 , 10:54:59

మాస్క్‌పై అవగాహనకు.. ‘మాస్క్‌ డే’ పాటిస్తున్న కర్ణాటక

మాస్క్‌పై  అవగాహనకు..  ‘మాస్క్‌ డే’ పాటిస్తున్న కర్ణాటక

బెంగళూరు: కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో మాస్కు ధరించడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కర్ణాటకలో గురువారం ‘మాస్క్‌ డే’గా పాటిస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో అవగాహన నడక నిర్వహించారు. ఆ రాష్ట్రానికి చెందిన పలువురు క్రీడాకారులు, సినీ ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. బెంగళూరులో విధానసౌధ నుంచి కుబ్బన్‌ పార్క్‌ వరకు జరిగిన అవగాహన నడకలో సీఎం బీఎస్‌ యెడియురప్ప పాల్గొన్నారు. ఆయనతో పాటు ఇందులో పాల్గొన్న మంత్రులు, అధికారులు మాస్కులు ధరించారు.

వైరస్‌ నుంచి రక్షణకు మాస్కు ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా యెడియురప్ప తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోయినా, భౌతిక దూరం పాటించకపోయినా రూ.200 జరిమానా విధించడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్ణాటకలో 7,500 మందికిపైగా కరోనా సోకగా, సుమారు 94 మంది మరణించారు.  


logo