బుధవారం 21 అక్టోబర్ 2020
National - Sep 29, 2020 , 12:20:42

కర్ణాటక క్యాబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ.!

కర్ణాటక క్యాబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ.!

బెంగళూరు : కర్ణాటక క్యాబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ, విస్తరణపై అధిష్ఠానంతో చర్చించేందుకు ఆ రాష్ట్ర సీఎం యెడియూరప్ప మంగళవారం ఢిల్లీకి పయనమయ్యారు. ఈ సారి క్యాబినెట్‌లో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి సిటి రవికి చోటు దక్కడం కష్టమని సమాచారం. అరవింద్‌ లింబావలి, ఉమేశ్‌ కట్టి, బసన్‌గౌడ పటిల్‌ యత్నాల్‌, సునీల్‌ కుమార్‌తోపాటు హలాడి శ్రీనివాస్‌ శెట్టికి క్యాబినెట్‌లో ఈ సారి చోటు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 27న సీఎం యెడియూరప్ప అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గారు. యడ్యూరప్ప ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఆదివారం ఆరుగంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చలో మూజువాణి ఓటుతో యడ్యూరప్ప ప్రభుత్వం అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఆయన మరోమారు రాష్ట్ర క్యాబినెట్‌ను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo