శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 25, 2020 , 13:20:47

బీజేపీ ఎంపీ కుమార్తెకు క‌రోనా పాజిటివ్

బీజేపీ ఎంపీ కుమార్తెకు క‌రోనా పాజిటివ్

బెంగ‌ళూరు : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి జీఎం సిద్దేశ్వ‌ర కుమార్తె ఆశ్వినికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. క‌ర్ణాట‌క‌కు చెందిన జీఎం సిద్దేశ్వ‌ర‌.. దేవంగిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్ స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఆశ్విని ఈ నెల 20వ తేదీన గుయానా నుంచి న్యూయార్క్, ఢిల్లీ మీదుగా బెంగ‌ళూరుకు చేరుకుంది. అయితే ఆమెకు క‌రోనా టెస్టులు నిర్వ‌హించ‌గా.. క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఆశ్విని ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఆమెతో పాటే బెంగ‌ళూరుకు వ‌చ్చారు. ఇద్ద‌రు పిల్ల‌ల వైద్య నివేదిక రావాల్సి ఉంది. ఎంపీ సిద్దేశ్వ‌ర‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కరోనా నెగిటివ్ వ‌చ్చింది. ఆశ్విని ఓ ఆస్ప‌త్రిలోని ఐసోలేష‌న్ వార్డులో చికిత్స పొందుతున్నారు. 


logo