శనివారం 30 మే 2020
National - May 12, 2020 , 16:17:36

నేను ఎమ్మెల్యే కొడుకును.. నాకు నిబంధనలు వర్తించవు

నేను ఎమ్మెల్యే కొడుకును.. నాకు నిబంధనలు వర్తించవు

బెంగళూరు: నేను అధికార పార్టీ  ఎమ్మెల్యే కొడుకును.. నాకు లాక్‌డౌన్‌ నిబంధనలు ఏవీ  వర్తించవు.. నా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తా.. అన్నట్లుగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు ముఖానికి మాస్క్‌ లేకుండా గుర్రాన్ని జాతీయ రహదారిపై దౌడు తీయించాడు. అధికార బీజేపీకి చెందిన గుండుల్‌పేట నియోజకవర్గం ఎమ్మెల్యే సీఎస్‌ నిరంజన్‌ కుమార్‌ తనయుడు భువన్‌ కుమార్‌.. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉన్నప్పటికీ మాస్క్‌ లేకుండా హైవేపై స్వారీ చేశాడు.

దీన్ని వీడియో తీసిన కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో పోలీసుల దాకా  వెళ్లింది. లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించి గుర్రంపై స్వారీ చేస్తున్న ఘటనపై విచారణ జరుపుతున్నట్టు చామ్‌రాజ్‌నగర్‌ ఎస్పీ తెలిపారు. అయినప్పటికీ భువన్‌కుమార్‌పై ఇంతవరకు ఎలాంటి కేసు నమోదుచేయలేదని తెలిసింది. కాగా, కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం కొత్త కేసులు 42 నమోదుకాగా.. మొత్తం కేసుల సంఖ్య వేయికి చేరుకొన్నది. 


logo