శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 10:22:56

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా క‌ర్ణాట‌క బంద్‌

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా క‌ర్ణాట‌క బంద్‌

బెంగ‌ళూరు: కేంద్ర‌ప్ర‌భుత్వంతోపాటు, రాష్ట్ర‌ప్ర‌భుత్వం తీసుకొచ్చిన రైతు వ్య‌తిరేక చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌పార్టీ క‌ర్ణాట‌కలో బంద్ నిర్వ‌హిస్తున్న‌ది. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులు రాష్ట్ర‌వ్యాప్తంగా రోడ్ల‌పై భారీగా నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేపట్టారు. ఈనేప‌థ్యంలో ప్ర‌భుత్వం భారీ భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేసింది. బంద్‌కు మ‌ద్ద‌తుగా రాష్ట్రంలోని వ్యవ‌సాయ సంబంధ దుకాణాదారులు స్వ‌చ్చంగా త‌మ షాపుల‌ను మూసివేశారు. 

కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌గా తీసుకొచ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు తోడు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం మ‌రో రెండు చ‌ట్టాల‌కు స‌వ‌ర‌ణ‌లు చేసింది. రాష్ట్రంలో వ్య‌వ‌సాయ భూముల‌ను సుల‌భంగా కొనుగోలు చేసే రెండు చ్చ‌ట్టాల‌కు బీఎస్ యెడియూర‌ప్ప నేతృత్వంలోని బీజేపీ ప్ర‌భుత్వం స‌వ‌ర‌ణ‌లు చేసింది. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌పార్టీ.. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు రైతుల‌ను బానిస‌లుగా మార్చ‌డానికే ఈ చ‌ట్టాలు చేశాయ‌ని ఆరోపించింది. 


మ‌రోవైపు కేంద్ర ప్ర‌భుత్వం చేసిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్‌పార్టీ ప‌లు రాష్ట్రాల్లో ఆందోళ‌నల‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా నేడు పంజాబ్ ముఖ్య‌మంత్రి కెప్టెన్ అమ‌రీద‌ర్ సింగ్ ధ‌ర్నా చేప‌ట్ట‌నున్నారు.