శనివారం 23 జనవరి 2021
National - Jan 07, 2021 , 16:22:21

ఇదే, మన నిద్రపోని నగరం.. ఏదో తెలుసా?

ఇదే, మన నిద్రపోని నగరం.. ఏదో తెలుసా?

బెంగళూరు: కర్ణాటకలో ఇకపై వారంలో 24 గంటలు వ్యాపారాలు చేసుకునేందుకు వ్యాపార, వాణిజ్య సంస్థలకు అక్కడి ప్రభుత్వం అనుమతించింది. పది, అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న దుకాణాలు, వాణిజ్య సంస్థలు ఇప్పుడు 24x7 ప్రాతిపదికన పనిచేయనున్నాయి. ఉపాధి కల్పించడం, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడమే ఈ చర్య ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొన్నది. అయితే, ఒక రోజులో పది గంటలకు మించి ఏ ఉద్యోగి కూడా పని చేయకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం తన సర్క్యులర్‌లో పేర్కొన్నది.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై బెంగళూరు నగరం నిద్రపోని నగరంగా భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్నది. ఇప్పటికే టెక్నాలజీ హబ్‌గా మారిన బెంగళూరు నగరంలో దేశవిదేశాలకు చెందిన ఎన్నో ప్రముఖ కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా బెంగళూరు నగరానికి ప్రత్యేకత ఏర్పడింది. మరింత ఎక్కువ మందికి ఉపాధి కల్పించడంతోపాటు ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు 24/7 ప్రాతిపదికన దుకాణాలు, వాణిజ్య సంస్థలు పనిచేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఓవర్ టైంతోపాటు పని కాలం ఏ రోజులో కూడా పది గంటలు మించకూడదని ప్రభుత్వం పేర్కొన్నది. ఉద్యోగులందరికీ కనీసం ఒక వారం సెలవు ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. మహిళా ఉద్యోగి రోజులో ఎనిమిది గంటలకు మించి పని చేస్తే ఆమెకు ఓవర్ టైం అలవెన్స్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నది. వీరికి రాత్రి 8 దాటిన తర్వాత పనిచేయడానికి అనుమతించకూడదని, అయితే, వ్రాతపూర్వక అనుమతి తీసుకుని రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటలకు పనిచేయడానికి అనుమతించవచ్చునని ప్రభుత్వం తెలిపింది. షిఫ్ట్ సమయాలను ఉల్లంఘించే యజమాన్యాలు చట్టపరమైన చర్యను ఎదుర్కొంటారని ప్రభుత్వం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి..

2021.. టెక్నాలజీ నామ సంవత్సరమే.. ఎందుకంటే!

భూమి వేగంగా తిరుగుతోంది.. ఎందుకంటే..?

మెడల్ని విరిచేసిన తుమ్ము.. ఏమైందంటే..?

బడ్జెట్‌లో ముందుకు రానున్న కొత్త బ్యాంకు

తిరిగి ఇందిరమ్మ చేతిలోకి అధికారం

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo