గురువారం 06 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 17:39:35

కర్ణాటక మంత్రి, ఆయన భార్యకు కరోనా పాజిటివ్‌

కర్ణాటక మంత్రి, ఆయన భార్యకు కరోనా పాజిటివ్‌

బెంగళూరు : కర్ణాటకలో కరోనా విలయం సృష్టిస్తుంది. సామాన్య ప్రజలతో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాజిటిల్‌, ఆయన భార్యకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయనతో పాటు భార్య హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వీడియో సందేశం పోస్ట్‌ చేశారు. తాను, తన భార్య వనజాకు లక్షణాలు కనిపించాయని, ఎవరూ భయాందోళనలకు గురి కావాల్సి అవసరం లేదని, ఇద్దరం త్వరలోనే కోలుకొని విధుల్లో చేరుతామనే నమ్మకం ఉందన్నారు. తన అల్లుడు కూడా ఈ వైరస్ బారిన పడ్డట్లు పాటిల్ శుక్రవారం రాత్రి ట్వీట్ చేశారు.  పాటిల్‌కు ముందు అటవీశాఖ మంత్రి ఆనంద్‌ సింగ్‌, పర్యాటక శాఖ మంత్రి సీటీ రవి కొవిడ్‌-19 పాజిటివ్‌గా పరీక్షించారు. మాండ్య ఎంపీ సుమలత అంబరీష్‌ సైతం ఇటీవల కరోనా బారినపడి, కోలుకున్నారు. ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప కూడా కొన్ని వారాల కిందట తన క్యాంప్‌ ఆఫీస్‌ కృష్ణలో కొంత మంది సిబ్బంది వైరస్‌ బారినపడినట్లు గుర్తించగా, ఆయన కొంతకాలం క్వారంటైన్‌లో ఉన్నారు. శుక్రవారం నాటికి 1.24లక్షల మంది కరోనా బారినపడగా, ఇందులో 2,314  మంది ప్రాణాలు కోల్పోయారు. 72,005 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo