బుధవారం 03 జూన్ 2020
National - May 16, 2020 , 09:34:47

కరోనా రహిత జిల్లాగా కార్గిల్‌

కరోనా రహిత జిల్లాగా కార్గిల్‌

లఢక్‌: కేంద్రపాలిత ప్రాంతమైన లఢక్‌లోని కార్గిల్‌ను కరోనా రహిత జిల్లాగా అధికారులు ప్రకటించారు. కరోనా బారిన పబడిన ఇద్దరు బాధితులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా లేదని, కొత్తగా ఎలాంటి పాజిటివ్‌ కేసులు నమోదవలేదని, అందువల్ల కార్గిల్‌ కరోనా రహిత జిల్లాగా మరిందని లఢక్‌ ఆరోగ్య, వైద్యవిద్య కార్యదర్శి రిజిన్‌ ప్రకటించారు.  

దేశంలో ఇప్పటివరకు 85,940 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రమాదకరమైన వైరస్‌లో 2752 మంది మరణించారు.


logo