బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 11:46:32

క‌క్రాపార్ అణు శాస్త్ర‌వేత్త‌ల‌కు కంగ్రాట్స్ చెప్పిన ప్ర‌ధాని మోదీ

క‌క్రాపార్ అణు శాస్త్ర‌వేత్త‌ల‌కు కంగ్రాట్స్ చెప్పిన ప్ర‌ధాని మోదీ

హైద‌రాబాద్‌: భార‌తీయ అణు శాస్త్ర‌వేత్త‌ల‌కు ప్ర‌ధాని మోదీ కంగ్రాట్స్ చెప్పారు.  క‌క్రాపార్ అటామిక్ ప‌వ‌ర్ ప్లాంట్-3లో అణు విద్యుత్తు ఉత్ప‌త్తి ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ శాస్త్ర‌వేత్త‌ల‌ను మెచ్చుకున్నారు.  క‌క్రాపార్ ప్లాంట్‌లో క్రిటికాలిటీ సాధించిన‌ట్లు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు.  700 మెగావాట్ల కేఏపీపీ-3 రియాక్ట‌ర్‌.. మేక్ ఇన్ ఇండియాకు గొప్ప ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంద‌న్నారు.  క‌క్రాపార్ మూడ‌వ ప్లాంట్‌ను స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో డిజైన్ చేసిన‌ట్లు మోదీ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. భ‌విష్య‌త్తు విజ‌యాల‌కు ఇది నాందిగా నిలుస్తుంద‌న్నారు.  

క‌క్రాపార్ అణు విద్యుత్తు కేంద్రం గుజ‌రాత్ రాష్ట్రంలో ఉన్న‌ది.  క్రిటికాలిటీ సాధించ‌డం అంటే.. ఆ అణు క‌ర్మాగారంలో సాధార‌ణ ఆప‌రేష‌న్ మొద‌లైన‌ట్లు లెక్క‌.  రియాక్ట‌ర్‌లో నార్మ‌ల్ ఆప‌రేష‌న్ ప్రారంభంకానున్న‌ది.  మూడ‌వ ప్లాంట్‌లో త్వ‌ర‌లోనే అణువిద్యుత్తును ఉత్ప‌త్తి చేయ‌నున్నారు.logo