మంగళవారం 19 జనవరి 2021
National - Jan 10, 2021 , 16:08:07

ప‌క్షుల్లో బ‌ర్డ్ ఫ్లూ ల‌క్ష‌ణాలు.. కాన్పూర్ జూ మూసివేత‌

ప‌క్షుల్లో బ‌ర్డ్ ఫ్లూ ల‌క్ష‌ణాలు.. కాన్పూర్ జూ మూసివేత‌

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్ జూపార్క్‌కు మూత‌ప‌డింది. ఆ జూలో చనిపోయిన ప‌క్షుల్లో బ‌ర్డ్ ఫ్లూ ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు నిర్ధార‌ణ కావ‌డంతో జూలోకి సంద‌ర్శ‌కుల ప్ర‌వేశంపై నిషేధం విధించిన‌ట్లు అధికారులు తెలిపారు. త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చేవర‌కు ఈ నిషేధం కొన‌సాగుతుంద‌ని చెప్పారు. బ‌ర్డ్ ఫ్లూ నేప‌థ్యంలో జూపార్క్ చుట్టూ ఒక‌ కిలోమీట‌ర్ ప‌రిధిని ఇన్‌ఫెక్ష‌న్ జోన్‌గా ప్ర‌క‌టించారు. 

కాగా, గ‌త ఐదు రోజుల వ్య‌వ‌ధిలో జూలో నాలుగు అడ‌వి కోళ్లు, రెండు రామ చిలుక‌లు స‌హా మొత్తం ఆరు ప‌క్షులు మృతిచెందాయ‌ని, వాటి శాంపిల్స్‌ను సేక‌రించి భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపించ‌గా రెండు ప‌క్షుల్లో బ‌ర్డ్ ఫ్లూ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని అధికారులు వెల్ల‌డించారు. దాంతో జూలో సంద‌ర్శ‌కుల ప్ర‌వేశాల‌పై నిషేధం విధించిన‌ట్లు తెలిపారు. అదేవిధంగా జూ చుట్టూ 10 కిలో మీట‌ర్ల ప‌రిధిని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించి, పక్షులు ప‌క్షుల మాంసం ర‌వాణాపై ఆంక్ష‌లు విధించారు.     ‌  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.