ఆదివారం 12 జూలై 2020
National - Jun 17, 2020 , 19:26:21

కాన్పూర్‌లో పానీపూరీ అమ్మ‌కాల‌పై నిషేధం

కాన్పూర్‌లో పానీపూరీ అమ్మ‌కాల‌పై నిషేధం

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లా‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ‌కు అడ్డుక‌ట్ట వేయ‌డం కోసం అక్క‌డి జిల్లా యంత్రాంగం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. పానీపూరి అమ్మకాల‌పై కాన్పూర్‌ జిల్లా అంత‌టా నిషేధం విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కాగా, జిల్లా అధికారులు తీసుకున్న నిర్ణ‌యం‌ పానీపూరీ ప్రియుల‌ను తీవ్ర నిరాశ‌కు గురిచేసింది. కాన్పూర్ జిల్లాలో ల‌భించే తినుబండారాల్లో పానీపూరికి ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. అక్క‌డి ప్ర‌జ‌లు నిత్యం పానీపూరి రుచి చూస్తారు. 

కాగా, పానీపూరీ వ్యాపారులు లాక్‌డౌన్‌ నిబంధనలను స‌రిగా పాటించడం లేదని, పానీపూరీ అమ్మకాలు జరిపే స‌మ‌యంలో చాలా మంది ముఖాల‌కు మాస్కులు, చేతుల‌కు గ్లౌజులు ధరించడం లేదని అధికారులు తెలిపారు. పానీపూరి వ్యాపారుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రించే ప్ర‌మాదం ఉన్న కార‌ణంగానే తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు. కాగా, జిల్లా అధికారులు నిర్ణ‌యంవ‌ల్ల తాము ఉపాధి కోల్పోయామ‌ని పానీపూరి వ్యాపారులు చెబుతున్నారు. 


logo