సోమవారం 18 జనవరి 2021
National - Dec 20, 2020 , 00:03:24

ప్రియాంక, దిల్జిత్‌లపై కంగన నిప్పులు

ప్రియాంక, దిల్జిత్‌లపై కంగన నిప్పులు

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరుగా ఉన్న బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌ తాజాగా మరోసారి స్పందించారు. తన సహచర నటులు ప్రియాంక చోప్రా, దిల్జిత్‌ దోసాంజ్‌లపై మండిపడ్డారు. గతంలో ముంబైని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చి ఆమె వార్తల్లోకి వచ్చారు. తాజాగా కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై తన అభిప్రాయాలను కుండబద్ధలు కొడుతున్నారు. తాజాగా రైతుల ఉద్యమానికి వ్యతిరేకంగా వీడియోను పోస్టు చేశారు. 

రైతుల ఆందోళనకు మద్దతు పలికిన ప్రియాంక చోప్రా, దిల్జిత్‌ దోసాంజ్‌లపై ట్విట్టర్‌ వేదికగా కంగన రనౌత్‌ మండిపడ్డారు. హిందీలో రూపొందించిన ఈ వీడియోలో కంగన రనౌత్‌ మాట్లాడుతూ.. ‘ప్రతిరోజూ నా అభిప్రాయాలను వెల్లడిస్తున్నా.. దేశభక్తురాలిగా పలు అంశాలపై క్లారిటీనిస్తున్నా.. కానీ దిల్జిత్‌ దోసాంత్‌, ప్రియాంక వంటి వారు తమ ఉద్దేశాలను ఎవరు ప్రశ్నించొద్దని భావిస్తారు. నేను దేశానికి అనుకూలంగా మాట్లాడుతున్నా? దీనిపై వారి నీతి.. విధానం ఏమిటి?’ అని ప్రశ్నించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.