బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 19, 2020 , 02:27:59

కంగనాకు మూడోసారి పోలీసుల నోటీసులు

కంగనాకు మూడోసారి పోలీసుల నోటీసులు

ముంబై: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌, ఆమె సోదరి రంగోలీ చందేల్‌కు ముంబై పోలీసులు మూడోసారి నోటీసులు జారీ చేశారు. మత విద్వేషం రెచ్చగొట్టే లక్ష్యంతో సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో ఈ నెల 23, 24 తేదీల్లో విచారణకు  హాజరుకావాలని ఆదేశించారు. గతంలో రెండుసార్లు కంగనాకు నోటీసులిచ్చారు.