శనివారం 16 జనవరి 2021
National - Jan 02, 2021 , 10:57:49

దారుణమైన అతిక్ర‌మ‌ణ‌.. కంగ‌నాపై ముంబై కోర్టు

దారుణమైన అతిక్ర‌మ‌ణ‌.. కంగ‌నాపై ముంబై కోర్టు

ముంబై‌: బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ ఇంటిని ముంబై మున్సిప‌ల్ అధికారులు కూల్చివేసిన విష‌యం తెలిసిందే. ఇంటి కూల్చివేత‌ను అడ్డుకోవాలంటూ ఆమె కోర్టును ఆశ్ర‌యించారు.  ఆ కేసులో ముంబైలోని శివారు ప్రాంతంలో ఉన్న దిన్‌దోషి కోర్టు ఆ ద‌ర‌ఖాస్తును తోసిపుచ్చింది.  కంగ‌నా ర‌నౌత్ వ్య‌వ‌హ‌రించిన‌ట్లు తీరు ప‌ట్ల కోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మున్సిప‌ల్ అధికారులు ఇచ్చిన ప్లాన్‌ను కంగ‌నా ఉల్లంఘించిన‌ట్లు కోర్టు త‌న తీర్పులో ఆరోపించింది. మూడు ఫ్లాట్ల‌ను అక్ర‌మ రీతిలో క‌లిపిన‌ట్లు కంగ‌న‌పై కోర్టు సీరియ‌స్ అయ్యింది.   జ‌డ్జి ఎల్ ఎస్ చ‌వాన్ ఈ కేసులో తీర్పును ఇచ్చారు. 

ఖ‌ర్ ఏరియా ప్రాంతంలో ఉన్న 16 అంత‌స్థుల బిల్డింగ్‌లోని అయిద‌వ అంత‌స్థులో ఉన్న మూడు ఫ్లాట్ల‌ను అక్ర‌మ‌ప‌ద్ధ‌తిలో క‌లిపిన‌ట్లు కోర్టు పేర్కొన్నది. సంక్ ఏరియా, డ‌క్ట్ ఏరియా, కామ‌న్ ప్యాసేజ్‌ల‌ను ఫ్రీ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్‌గా మారిన‌ట్లు జ‌డ్జి త‌న తీర్పులో చెప్పారు.  అనుమ‌తి ఇచ్చిన ప్లాన్‌ను మార్చి దారుణ‌మైన అతిక్ర‌మ‌ణ‌కు కంగ‌నా పాల్ప‌డిన‌ట్లు కోర్టు పేర్కొన్న‌ది. ఖ‌ర్ ఫ్లాట్స్‌లో అనుమ‌తి లేని నిర్మాణం జ‌రుగుతున్న‌ద‌ని మార్చి 2018లో బృహ‌న్‌ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కంగ‌నాకు లేఖ రాసింది. ఆ కూల్చివేత‌ను అడ్డుకోవాల‌ని ర‌నౌత్ కోర్టును వేడుకున్న‌ది.