మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Sep 11, 2020 , 20:04:54

సోనియా మౌనాన్ని ప్రశ్నించిన కంగనా

సోనియా మౌనాన్ని ప్రశ్నించిన కంగనా

ముంబై: తన కార్యాలయాన్ని బీఎంసీ కూల్చివేతపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మౌనం వహించడంపై నటి కంగనా రనౌత్ ప్రశ్నించింది. పశ్చిమ దేశాల్లో పెరిగిన సోనియా భారత్‌లో ఉంటున్నారని అయినా మహిళల బాధలు ఆమెకు పట్టడం‌లేదని విమర్శించింది. మహారాష్ట్రలోని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలపై వేధింపులు పెరిగినా, న్యాయం, చట్టాలను అపహాస్యం చేస్తున్నా సోనియా మౌనంగా ఉండటంపై కాలమే బుద్ధి చెబుతుందని హెచ్చరించింది. కంగనా కార్యాలయంలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపించిన బీఎంసీ ఆ మేరకు నోటీసులు జారీ చేయడంతోపాటు బుధవారం వాటిని కూల్చివేసింది. కాగా తనపై కక్షతోనే మహారాష్ట్ర ప్రభుత్వం తన కార్యాలయాన్ని కూల్చివేసినట్లు కంగనా రనౌత్ ఆరోపించింది. ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగమైనప్పటికీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ డ్రామాపై మౌనం వహించడంపై కంగనా మండిపడింది. సాటి మహిళపై శివసేన ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్నా ఆమె నోరు విప్పకపోవడంపై విమర్శించింది. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం పలు ట్వీట్లు చేసింది.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo