శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 10, 2020 , 01:44:23

చరిత్ర సృష్టించిన కామ్య

చరిత్ర సృష్టించిన కామ్య
  • దక్షిణ అమెరికాలో ఎత్తైన శిఖరాన్ని
  • అధిరోహించిన నేవీ స్కూల్‌ విద్యార్థిని

న్యూఢిల్లీ: ముంబైలోని నౌకాదళానికి చెందిన పిల్లల పాఠశాల విద్యార్థిని కామ్య కార్తికేయన్‌ చరిత్ర సృష్టించింది. ఏడవ తరగతి చదువుతున్న ఈ బాలిక, దక్షిణ అమెరికాలోని అత్యంత ఎత్తైన అకాన్కాగో శిఖరాన్ని ఈనెల ఒకటో తేదీన అధిరోహించిందని, అక్కడ జాతీయ పతాకాన్ని ఎగురవేసిందని నేవీ అధికారులు తెలిపారు. ఆసియా బయట ఎత్తైన ఈ 6962 మీటర్ల పర్వతాన్ని అధిరోహించిన ప్రపంచంలోనే పిన్న బాలికగా కామ్య రికార్డు సాధించినట్లు పేర్కొన్నారు. ఈ ఘనత కోసం ఆ విద్యార్థిని కొన్నేండ్లుగా ఎంతో శ్రమించడంతోపాటు ఎన్నో అవరోధాలను అధిగమించినట్లు నౌకాదళ అధికారులు వెల్లడించారు.


logo