గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 21, 2020 , 02:54:24

బలపరీక్షకు ముందే పదవి నుంచి వైదొలిగిన మధ్యప్రదేశ్‌ సీఎం

బలపరీక్షకు ముందే పదవి నుంచి  వైదొలిగిన మధ్యప్రదేశ్‌ సీఎం

- సింధియా, బీజేపీపై విమర్శలు

- ఇది ప్రజావిజయం: సింధియా

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో 18 రోజలుపాటు సాగిన పొలిటికల్‌ డ్రామా ముగిసింది. అసెంబ్లీలో బలపరీక్షకు సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువుకు కొన్ని గంటల ముందే సీఎం కమల్‌నాథ్‌ తన పదవికి రాజీనామా చేశారు. మొత్తం 22 మంది కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించడంతో.. కాంగ్రెస్‌ బలం పడిపోయిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కమల్‌నాథ్‌ రాజీనామాను గవర్నర్‌ లాల్జీ టాండన్‌ ఆమోదించారు. తదుపరి సీఎం నియమితులయ్యే వరకు ఆపద్ధర్మ సీఎం కొనసాగాలని ఆయనను కోరారు. ’40 ఏండ్ల నా ప్రజా జీవితంలో స్వచ్ఛమైన రాజకీయాలు చేశా. గత 2 వారాల పరిణామాలు ప్రజాస్వామ్య విలువలను దిగజార్చాయి’ అని కమల్‌నాథ్‌ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ప్రజాస్వామ్య విలువల కోసమే సీఎం పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా’ అని చెప్పారు. ‘అధికార దాహంతో ప్రజలు తిరస్కరించిన ఒక మహారాజ (సింధియా), దురాశపరులైన 22 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ కుట్రతో ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేశాయి‘ అని అన్నా రు. కాగా, సత్యానిదే విజయం అని జ్యోతి రాదిత్య సింధియా అన్నారు. అంతర్గత కొట్లాటలే కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనానికి కారణమని బీజేపీ పేర్కొంది. 


logo