శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 22, 2021 , 14:31:28

చెన్నై దవాఖాన నుంచి కమల్‌ డిశ్చార్జి

చెన్నై దవాఖాన నుంచి కమల్‌ డిశ్చార్జి

చెన్నై :  ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ చెన్నై రామచంద్ర వైద్యశాల నుంచి శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. కుడి కాలి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న కమల్‌ హాసన్‌కు ఈనెల 19న వైద్యులు సర్జరీ చేశారు. ఆపరేషన్‌ విజయవంతమైందని ఆయన కుమార్తెలు శ్రుతి హాసన్‌, అక్షర హాసన్‌లతో పాటు వైద్యులు వెల్లడించారు. వారం రోజుల పాటు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకోవాలని కమల్‌ హాసన్‌కు వైద్యులు సూచించారు.

ఈస్ట్‌కోస్ట్‌ రోడ్‌లోని నివాసంలో విశ్రాంతి తీసుకోనున్న కమల్‌ కోలుకున్న అనంతరం సినిమాలు, రాజకీయ కార్యకలాపాలపై దృష్టిసారించనున్నారు. గతంలోనూ పలుసార్లు సర్జరీలు జరిగిన కమల్‌ శరీరానికి 16 ఫ్రాక్చర్లు అయ్యాయి. ఇక దవాఖాన నుంచి డిశ్చార్జి అయిన కమల్‌ హాసన్‌కు తమ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. 

VIDEOS

logo