శనివారం 11 జూలై 2020
National - Jun 22, 2020 , 16:09:33

కామాఖ్య ఆల‌యంలో జూన్ 30 నుంచి ద‌ర్శ‌నాలు షూరూ

కామాఖ్య ఆల‌యంలో జూన్ 30 నుంచి ద‌ర్శ‌నాలు షూరూ

గువాహ‌టి: కామాఖ్య ఆల‌యంలో భ‌క్తులకు ద‌ర్శ‌నాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. జూన్ 30 నుంచి ఆల‌యంలో అమ్మ‌వారి ద‌ర్శ‌నాల‌కు భ‌క్తుల‌ను అనుమ‌తించ‌నున్న‌ట్లు ఆల‌య క‌మిటీ ప్ర‌క‌టించింది. దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ కార‌ణంగా దాదాపు గ‌త మూడు నెల‌ల నుంచి కామాఖ్య ఆల‌యంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నాలపై నిషేధం విధించారు.

ఇదిలావుంటే, కామాఖ్య ఆల‌యంలో ప్ర‌తి ఏడాది జూన్ 22 నుంచి 25 వ‌ర‌కు అంబుబాచి మేళా నిర్వ‌హిస్తారు. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో ఈసారి మేళాను ర‌ద్దు చేస్తున్న‌ట్లు కామాఖ్య ఆల‌య క‌మిటీ వెల్ల‌డించింది. ప్ర‌తి ఏటా అంబుబాచి మేళా ఘ‌నంగా జ‌రుగుతుంది. ల‌క్ష‌ల మంది భ‌క్తులు ఈ మేళాలో పాల్గొంటారు. గ‌త ఏడాది జ‌రిగిన అంబుబాచి మేళాకు దాదాపు 25 ల‌క్ష‌ల మంది హాజ‌ర‌య్యారు.                      


logo