శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Aug 01, 2020 , 00:38:38

పంజాబ్‌లో కల్తీ మద్యానికి 38 మంది బలి

పంజాబ్‌లో కల్తీ మద్యానికి  38 మంది బలి

  • 8 మంది అరెస్టు.. దర్యాప్తునకు సీఎం ఆదేశం

చండీగఢ్‌, జూలై 31: పంజాబ్‌లో ఘోరం జరిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కల్తీ మద్యం తాగి మూడు రోజుల్లో 38 మంది చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. ఈ మద్యాన్ని అమృత్‌సర్‌లోని ముచ్ఛల్‌ గ్రామంలో తయారు చేసినట్టు తెలుస్తున్నది. మరణాలపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని సీఎం అమరీందర్‌ సింగ్‌ అధికారులను ఆదేశించారు. కల్తీ మద్యాన్ని అమ్ముతున్న 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఓ పోలీసును అధికారులు సస్పెండ్‌ చేశారు. మరో వైపు ఈ మరణాలపై ప్రతిపక్ష పార్టీ శిరోమణి అకాళీదల్‌  విరుచు కుపడింది. న్యాయవిచారణకు డిమాండ్‌ చేసింది. అమరీం దర్‌ సింగ్‌ సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ డిమాండ్‌ చేసింది.


logo