బుధవారం 03 జూన్ 2020
National - Feb 09, 2020 , 01:39:16

111 ఏండ్ల బామ్మ ఆదర్శం

111 ఏండ్ల బామ్మ ఆదర్శం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 111 ఏండ్ల వయసున్న వృద్ధురాలు ఓటేసి చరిత్ర సృష్టించారు. కుమారుడు, మనుమడు, ఇతర కుటుంబసభ్యులు వెంట రాగా కాళీతారా మండల్‌ అనే బామ్మ శనివారం ఢిల్లీ సీఆర్‌ పార్క్‌ ప్రాంతంలోని పోలింగ్‌ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఓటేసి వచ్చిన అనంతరం మీడియాతో కాళీతారా మాట్లాడుతూ.. ‘నాలుగు తరాలుగా ఓటేస్తున్నాను. రాజ్యాంగం కల్పించిన హక్కును సక్రమంగా వినియోగించుకొంటూ ప్రతి ఒక్క ఓటరూ ఓటేయాలి. ఇప్పటివరకు ఎన్నిసార్లు ఓటేశానో జ్ఞాపకం లేదు’ అని చెప్పారు. 


logo