ఆదివారం 12 జూలై 2020
National - Jun 15, 2020 , 09:03:19

కాలాపానీ భారత్‌దే.. స్పష్టంచేస్తున్న ఉత్తరాఖండ్‌ మేధావులు

కాలాపానీ భారత్‌దే.. స్పష్టంచేస్తున్న ఉత్తరాఖండ్‌ మేధావులు

న్యూఢిల్లీ: భారతదేశ భూభాగమైన కాలాపానీ తమ భూభాగమని నేపాల్‌ పేర్కొనడాన్ని ఉత్తరాఖండ్‌కు చెందిన పలువురు మేధావులు వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు స్వాతంత్య్రానికి పూర్వం రచించిన పలు గ్రంథాలు, పుస్తకాల్లోని అంశాలను ప్రస్తావిస్తున్నారు. కాలా నదికి మూలం కాలాపానీనే అని స్కంధ పురాణంలో స్పష్టంగా ఉన్నదని చరిత్ర ప్రొఫెసర్‌ వీడీఎస్‌ నేగీ పేర్కొన్నారు. కాలీ నదిని సరిహద్దుగా రెండు దేశాలు భావిస్తున్నప్పటికీ, ఆ నదికి మూలం కాలాపానీ అని భారత్‌ చెబుతుండగా, నేపాల్‌ మాత్రం లింపియాధురలోని కుటి-యాంగ్టి అని పేర్కొంటున్నది. మరోవైపు, పలువురు చరిత్రకారులు కూడా కాలా నదికి మూలం కాలాపానీనే అని తమ పుస్తకాల్లో స్పష్టంచేశారు. 

భారత భూభాగాలైన కాలాపానీ, లిపులేఖ్‌, లింపియాధుర ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంటూ నేపాల్‌ రూపొందించిన వివాదాస్పద మ్యాప్‌నకు ఆ దేశ పార్లమెంట్‌లోని రెండు సభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే నేపాల్‌ చర్య ఏమాత్రం సమర్థనీయం కాదని భారత్‌ ఇప్పటికే తీవ్రంగా ఖండించింది.


logo