గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 11:05:28

బీజేపీ ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్

బీజేపీ ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క‌లో క‌రోనా వైర‌స్ క‌రాళ నృత్యం చేస్తోంది. క‌రోనా విల‌య‌తాండ‌వానికి ఆ రాష్ర్ట ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధుల‌కు క‌రోనా సోక‌గా, తాజాగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యే బ‌స‌వ‌రాజు మ‌త్తిముడ్‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో క‌ర్ణాట‌క‌లో క‌రోనా సోకిన ఎమ్మెల్యే సంఖ్య మూడుకు చేరింది. ఎమ్మెల్యే బ‌స‌వ‌రాజు క‌ల‌బురాగి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. బ‌స‌వ‌రాజు బెంగ‌ళూరులోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. త‌నను ఇటీవ‌ల క‌లిసిన వారంతా.. క‌రోనా నివార‌ణ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కోరారు. సేడం ఎమ్మెల్యే రాజ్‌కుమార్ పాటిల్, జీవ‌ర్గి ఎమ్మెల్యే అజ‌య్ సింగ్ కు కూడా క‌రోనా సోకింది. 

క‌ర్ణాట‌క‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,504కు చేర‌గా, మృతుల సంఖ్య 2,147కు చేరిన‌ట్లు ఆ రాష్ర్ట వైద్యాధికారులు వెల్ల‌డించారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 67,447 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మ‌హ‌మ్మారి నుంచి 42,901 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.


logo