గురువారం 28 మే 2020
National - May 08, 2020 , 12:55:43

17,060 అడుగుల ఎత్తు..మాన‌సస‌రోవ‌ర్ టు లిపులేఖ్ పాస్ మార్గం

17,060 అడుగుల ఎత్తు..మాన‌సస‌రోవ‌ర్ టు లిపులేఖ్ పాస్ మార్గం

ఉత్త‌రాఖండ్ : లాక్ డౌన్ కొనసాగుతున్న నేప‌థ్యంలో ప‌లు ప్రాంతాల్లో ర‌‌హ‌దారుల పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు కొన‌సాగుతున్నాయి. ఉత్త‌రాఖండ్  లో లాక్ డౌన్ కొన‌సాగుతుండంతో బార్డ‌ర్ రోడ్స్ ఆర్గ‌నైజేష‌న్ (బీఆర్వో) కైలాశ్ మాన‌స స‌రోవ‌ర్ మార్గాన్ని లిపులేఖ్ పాస్ తో అనుసంధానించే పనులను పూర్తి చేసింది.

17,060 మీట‌ర్ల ఎత్తులో ఉత్త‌రాఖండ్ నుంచి లిపులేఖ్ పాస్ కు ఈ మార్గాన్ని అనుసంధానించారు. ఈ మార్గంతో 90కిలో మీట‌ర్ల మేర ప‌ర్వ‌తారోహ‌ణను నివారించ‌డంతోపాటు వాహ‌నాల్లో చైనా స‌రిహ‌ద్దుల వ‌ర‌కు వెళ్లే అవ‌కాశ‌ముంటుంద‌ని బీఆర్వో ఉన్న‌తాధికారి ఒక‌రు వెల్ల‌డించారు. ఉత్త‌రాఖండ్ లోని లిపు లేఖ్ పాస్ మీదుగా కైలాశ్ మాన‌స స‌రోవ‌ర్ యాత్ర కొన‌సాగుతుంద‌న్న విష‌యం తెలిసిందే. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo