ఆదివారం 29 మార్చి 2020
National - Feb 22, 2020 , 14:28:26

ట్రంప్‌తో డ్యాన్స్‌ చేయిస్తా : సింగర్‌ కైలాష్‌ ఖేర్‌

ట్రంప్‌తో డ్యాన్స్‌ చేయిస్తా : సింగర్‌ కైలాష్‌ ఖేర్‌

ముంబయి : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో డ్యాన్స్‌ చేయిస్తానని బాలీవుడ్‌ సింగర్‌ కైలాష్‌ ఖేర్‌ పేర్కొన్నారు. 24వ తేదీన అహ్మదాబాద్‌లోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో నమస్తే ట్రంప్‌ కార్యక్రమం జరగనుంది. ఈ వేదికపై కైలాష్‌ ఖేర్‌ తన పాటలతో ప్రేక్షకులను అలరించనున్నారు. అయితే తన కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నానని కైలాష్‌ తెలిపారు. 'జై - జై-కారా, స్వామి సాత్‌ దేనా హమారా' పాటతో తన ప్రదర్శనను ప్రారంభించి.. 'బమ్‌ బమ్‌ లాహిరి' పాటతో ముగిస్తానని ఆయన పేర్కొన్నారు. తన పాటలతో ట్రంప్‌ను మంత్రముగ్ధుడిని చేసి డ్యాన్స్‌ చేయించేందుకు ప్రయత్నిస్తానని కైలాష్‌ స్పష్టం చేశారు. 24, 25 తేదీల్లో ట్రంప్‌ ఇండియాలో పర్యటించనున్న విషయం తెలిసిందే.

'భరత్ అనే నేను' మూవీలో 'వచ్చాడయ్యో సామి' అనే పాపులర్ సాంగ్ ను పాడింది ఈ కైలాష్ ఖేరే. ఇవే కాకుండా పలు తెలుగు పాటలు కైలాష్ ఖేర్ ఆలపించి.. టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్నారు.


logo