బుధవారం 08 జూలై 2020
National - Jun 30, 2020 , 09:25:56

మ‌రో ఏడాది పాటు అటార్నీ జ‌న‌ర‌ల్‌గా కేకే వేణుగోపాల్

మ‌రో ఏడాది పాటు అటార్నీ జ‌న‌ర‌ల్‌గా కేకే వేణుగోపాల్

హైద‌రాబాద్‌: భార‌త అటార్నీ జ‌న‌ర‌ల్‌గా కేకే వేణుగోపాల్‌ను పున‌ర్ నియ‌మించారు.  ఏడాది పాటు ఆయ‌న ప‌ద‌వీకాలాన్ని పొడ‌గించారు.  వేణుగోపాల్‌ మూడేళ్ల ప‌ద‌వీ కాలం మంగ‌ళ‌వారంతో ముగియ‌నున్న‌ది. రాష్ట్ర‌ప‌తి ఆదేశాల మేర‌కు సీనియ‌ర్ అడ్వ‌కేట్ కేకే వేణుగోపాల్‌ను అటార్నీ జ‌న‌ర‌ల్‌గా నియ‌మిస్తున్న‌ట్లు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. 89 ఏళ్ల వేణుగోపాల్‌కు త‌న ప‌ద‌వీకాలం గురించి తెలియ‌జేసినట్లు సీనియ‌ర్ ప్ర‌భుత్వ అధికారులు తెలిపారు.  2017లో ముఖుల్ రోహ‌త్గీ నుంచి వేణుగోపాల్ అటార్నీ జ‌న‌ర‌ల్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 

 


logo