సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 11, 2020 , 15:33:36

అవినీతి, అక్రమాలకు మధ్యప్రదేశ్‌ అడ్డా : సింధియా

అవినీతి, అక్రమాలకు మధ్యప్రదేశ్‌ అడ్డా : సింధియా

న్యూఢిల్లీ : అవినీతి, అక్రమాలు, ఇసుక మాఫియాకు అడ్డాగా మారిందని జ్యోతిరాధిత్య సింధియా ఆరోపించారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరిన అనంతరం జేపీ నడ్డాతో కలిసి జ్యోతిరాధిత్య సింధియా మీడియాతో మాట్లాడారు. 'నా జీవితంలో రెండు ఘటనలు ఎప్పటికీ మరువలేను. 2001, సెప్టెంబర్‌ 30న మా నాన్నను కోల్పోయాను. మా నాన్న మరణం నా జీవిత స్వరూపాన్ని మార్చింది. 2020, మార్చి 10న సరికొత్త నిర్ణయం తీసుకున్నాను. నాయకుడికి జనసేన చేయడమే లక్ష్యంగా ఉండాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో కొత్త ఆలోచనలు స్వీకరించే పరిస్థితి లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం విఫలమైంది. ప్రజలకు సేవ చేసే అదృష్టం బీజేపీ కల్పించింది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పనలో విఫలమైందన్నారు. మధ్యప్రదేశ్‌లో అవినీతి, అక్రమాలు, ఇసుక మాఫియా అధికమైంది. ప్రజలకు సేవ చేయడానికి ప్రధాని మోదీ, అమిత్‌ షా తనకు అవకాశం ఇచ్చారు. అమిత్‌ షా, జేపీ నడ్డా మార్గదర్శనంలో పని చేస్తాను. ప్రజల సేవకు బీజేపీ కార్యకర్తలతో కలిసి పని చేస్తాను' అని సింధియా చెప్పారు. 


logo