బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 12, 2020 , 21:42:43

రాజస్థాన్‌ సంక్షోభంపై స్పందించిన జ్యోతిరాదిత్య సింధియా

రాజస్థాన్‌ సంక్షోభంపై స్పందించిన జ్యోతిరాదిత్య సింధియా

భోపాల్‌ : రాజస్థాన్‌ అధికార కాంగ్రెస్‌లో నెలకొన్న అనిశ్చితిపై మధ్యప్రదేశ్‌ బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. కాంగ్రెస్‌లో పార్టీలో ప్రతిభ, సామర్థ్యానికి విశ్వసనీయత తక్కువగా ఉంటుందని విమర్శించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కావాలనే తన మాజీ సహచరుడు, ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ను పక్కన బెట్టి హింసించారని ఆరోపించారు. సచిన్‌ను ఇలా చూడటం బాధగా ఉందని ట్వీట్‌ చేశారు. మూడు నెలల కిందట మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా.. సీఎం కమల్‌నాథ్‌తో విభేదాల నేపథ్యంలో జ్యోతిరాద్యి సింధియా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. చేజేతులా ప్రభుత్వాన్ని కూల్చివేసుకున్న కాంగ్రెస్ పార్టీకి మరో టెన్షన్ మొదలయింది. రాజస్థాన్‌లో డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలు కొందరు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యవహారశైలిపై అసంతృప్తిగా ఉన్నారు. దాదాపు 20 మంది దాకా ఎమ్మెల్యేలు ఢిల్లీలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వారు ఏ క్షణమైనా బీజేపీ చేరుతారన్న ప్రచారం ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 


తాజావార్తలు


logo