మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 01, 2020 , 15:55:58

‘హస్తం గుర్తుకు ఓటెయ్యమన్న సింధియా’

‘హస్తం గుర్తుకు ఓటెయ్యమన్న సింధియా’

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా దాబ్రాలో ఆ పార్టీ నేత జ్యోతిరాధిత్య సింధియా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అభ్యర్థులను పరిచయం చేస్తూ.. పొరపాటున హస్తం గుర్తుకు ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ పేరును ప్రస్తావించబోయి ఆగిపోయారు. అనంతరం తన పొరపాటును గ్రహించిన ఆయన మళ్లీ పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఆయన పక్కనే ఆ పార్టీ అభ్యర్థి ఏమీ అనలేక చిరునవ్వులు చిందించడం కనిపించింది. ఇదిలా ఉండగా.. కమల్‌నాథ్‌తో జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీపై తిరుగుబావుటా ఎగుర వేయడంతో ఆయన వర్గీయులు 22 మంది ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేశారు. మార్చిలో కమల్‌నాథ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. అలాగే పలు కారణాలతో మరో ఆరు స్థానాలు ఖాళీ కాగా.. రాష్ట్రంలో 28 స్థానాలకు ఉప ఎన్నికలు నవంబర్‌ 3న జరుగున్నాయి. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.