బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 10, 2020 , 16:54:45

కేంద్ర మంత్రివర్గంలోకి జ్యోతిరాదిత్య?

కేంద్ర మంత్రివర్గంలోకి జ్యోతిరాదిత్య?

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ అంసతృప్త నేత, మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి నట్వర్‌ సింగ్‌ స్పందించారు. జోతిరాదిత్య కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరనుండటం తనకేమి ఆశ్చర్యం కలిగించలేదన్నారు. జ్యోతిరాదిత్యాను బీజేపీ రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. అతడి తండ్రి మాధవరావ్‌ సింధియా బ్రతికి ఉన్నైట్లెతే ప్రధానమంత్రి అయ్యేవాడని నట్వర్‌ సింగ్‌ పేర్కొన్నారు.  


logo