శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 13, 2020 , 15:11:15

నామినేషన్‌ దాఖలు చేసిన జ్యోతిరాధిత్య సింధియా

నామినేషన్‌ దాఖలు చేసిన జ్యోతిరాధిత్య సింధియా

భోపాల్‌ : భారతీయ జనతా పార్టీ నాయకులు జ్యోతిరాధిత్య సింధియా రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు సింధియా తన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం, బీజేపీ నాయకుడు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. జ్యోతిరాధిత్య సింధియా ఈ నెల 11న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నడ్డా సమక్షంలో కమలం గూటికి చేరిన విషయం విదితమే. అదే రోజు సాయంత్రం.. రాజ్యసభ అభ్యర్థిగా సింధియా పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించింది. మరుసటి రోజు మర్యాదపూర్వకంగా రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌షాను సింధియా కలిశారు. ఈ నెల 26న రాజ్యసభకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.


logo