శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 10, 2020 , 14:35:31

జ్యోతిరాదిత్య సింధియా అధికారం లేకుండా బ్రతకలేడు : అశోక్‌ గెహ్లాట్‌

జ్యోతిరాదిత్య సింధియా అధికారం లేకుండా బ్రతకలేడు : అశోక్‌ గెహ్లాట్‌

హైదరాబాద్‌ : జ్యోతిరాదిత్యా సింధియా ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసిండని కాంగ్రెస్‌ నేత, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి ఈ సాయంత్రం బీజేపీలో చేరుతున్న విషయం తెలిసిందే. దీనిపై సీఎం అశోక్‌ గెహ్లాట్‌ స్పందిస్తూ... జ్యోతిరాదిత్య సింధియా వంటివారు అధికారం లేకుండా బ్రతకలేరన్నారు. అతడు ఎంత త్వరగా వెళ్లిపోతే అంత మంచిదన్నారు. జాతీయ సంక్షోభ సమయంలో బీజేపీతో చేతులు కలపడం అంటే వ్యక్తి రాజకీయ స్వలాభాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు.


logo