మంగళవారం 31 మార్చి 2020
National - Mar 20, 2020 , 13:48:48

న్యాయం వ‌ర్ధిల్లింది : ప్ర‌ధాని మోదీ

న్యాయం వ‌ర్ధిల్లింది :  ప్ర‌ధాని మోదీ

హైద‌రాబాద్‌:  నిర్భ‌య గ్యాంగ్ రేప్ కేసులో న‌లుగురు దోషుల్ని ఇవాళ ఉరి తీశారు.  దీనిపై ప్ర‌ధాని మోదీ స్పందించారు.  న్యాయం వ‌ర్ధిల్లింద‌ని ఆయ‌న త‌న ట్వీట్‌లో తెలిపారు.  మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, గౌర‌వానికి ప్ర‌త్యేక గుర్తింపు ఇవ్వాల్సిన సంద‌ర్భం వ‌చ్చింద‌న్నారు.  మ‌న నారీశ‌క్తి ప్ర‌తి రంగంలో ఉత్త‌మంగా రాణిస్తోంద‌న్నారు.  మ‌హిళా సాధికార‌త‌తో దేశాన్ని పురోగ‌మించే విధంగా చూడాల‌న్నారు.  స‌మాన‌త్వం, అవ‌కాశాల‌కు పెద్ద పీట వేయాల‌న్నారు.   

న్యాయం గెలిచిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ కూడా త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్న‌ది. క్రూర‌మైన నేరాల‌కు పాల్ప‌డుతున్న వారికి కూడా ఇలాంటి శిక్ష‌నే అమ‌లు చేయాల‌ని ఆ పార్టీ సూచించింది. ఒక్క నిందితుడు కూడా శిక్ష నుంచి త‌ప్పించుకోరాదు అంటూ ఆ పార్టీ అభిప్రాయ‌ప‌డింది. 

 


logo
>>>>>>