ఆదివారం 05 జూలై 2020
National - Jun 23, 2020 , 19:48:52

కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా అనంత్‌ మనోహర్‌

కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా అనంత్‌ మనోహర్‌

కొచ్చి :  కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా అనంత్‌ మనోహర్‌  బాదర్‌ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకు ముందు ఆయన బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు 2020 ఏప్రిల్ 27న జస్టిస్ బాదర్‌ను బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం గత నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు ఆవరణలోని విందు హాలులో జస్టిస్ బాదర్‌తో చీఫ్ జస్టిస్ ఎస్.మణికుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ బాదర్ మహారాష్ట్ర న్యాయసేవల్లో చేరి 2000 నవంబరులో జిల్లా న్యాయమూర్తిగా నియామకమయ్యారు. అకోలా, వార్ధాలలో అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిగా పని చేశారు. బాంబే హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్)గా కూడా కొనసాగారు. 2014 మార్చి౩న బొంబాయి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఉన్న ఆయన 2016 మార్చిలో న్యాయమూర్తిగా నియామకమయ్యారు.


logo