మంగళవారం 31 మార్చి 2020
National - Feb 26, 2020 , 18:37:32

విద్వేష ప్ర‌సంగాలు.. వీడియోలు వీక్షించిన ధ‌ర్మాస‌నం

విద్వేష ప్ర‌సంగాలు.. వీడియోలు వీక్షించిన ధ‌ర్మాస‌నం

హైద‌రాబాద్‌: అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ నేత‌లు చేసిన విద్వేష‌పూరిత ప్ర‌సంగాల వీడియోల‌ను ఢిల్లీ హైకోర్టు న్యాయ‌మూర్తులు కోర్టు రూమ్‌లోనే వీక్షించారు.  బీజేపీ నేత‌లు క‌పిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్‌, ప‌ర్వేశ్ వ‌ర్మ‌, అభ‌య్ వ‌ర్మ‌ల‌ను వీడియోను చూశారు. విద్వేష ప్ర‌సంగాల ప‌ట్ల ఎఫ్ఐఆర్‌ల‌ను న‌మోదు చేయ‌డంలో ఏమాత్రం జాప్యం అవ‌స‌రం లేద‌ని కోర్టు పేర్కొన్న‌ది. ఆ న‌లుగురి నేతల‌పై ఎందుకు ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌కూడ‌ద‌ని కోర్టు ప్ర‌శ్నించింది. ఆ న‌లుగురు నేత‌ల్లో ఓ కేంద్ర‌మంత్రి, ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే ఉన్నారు. ఇలాంటి రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు చేసిన వారిపై ఎందుకు కేసులు బుక్ చేయ‌డం లేద‌ని కోర్టు అడిగింది. క్రైమ్ జ‌రిగింద‌న‌డానికి ఇంత‌క‌న్నా సాక్ష్యం ఏమీ కావాల‌ని జ‌స్టిస్ ముర‌ళీధ‌ర్ ఢిల్లీ పోలీసుల‌ను ప్ర‌శ్నించారు.  బీజేపీ నేత‌లు చేసిన విద్వేష ప్ర‌సంగాల వ‌ల్లే.. సీఏఏ వ్య‌తిరేకుల‌పై దాడి జ‌రుగుతోంది. 


   


logo
>>>>>>