శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 25, 2020 , 20:02:15

కరోనా పరిస్థితులపై జేపీ నడ్డా వీడియోకాన్ఫరెన్స్‌

కరోనా పరిస్థితులపై జేపీ నడ్డా వీడియోకాన్ఫరెన్స్‌

న్యూఢిల్లీ:  బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఆ పార్టీ సీనియర్‌ నేతలు, కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కోవిడ్‌-19 వ్యాప్తి చెందకుండా దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు చేపడుతున్న సహాయక చర్యల గురించి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా అడిగి తెలుసుకున్నారు. గత రెండు రోజులుగా జేపీ నడ్డా సుమారు లక్షల మంది పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రజలకు అవగాహన కల్పించాలని, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక దూరాన్ని పాటించాల్సిన ఆవశ్యకతను వివరించాలని పార్టీ శ్రేణులకు జేపీ నడ్డా నిర్దేశించారు. 


logo