ఆదివారం 07 జూన్ 2020
National - Apr 04, 2020 , 12:03:45

జర్నలిస్టు, ఆయన కూతురుకు కరోనా నెగిటివ్‌

జర్నలిస్టు, ఆయన కూతురుకు కరోనా నెగిటివ్‌

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ జర్నలిస్టుకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం విదితమే. జర్నలిస్టు కూతురి ద్వారా ఆయనకు కరోనా సోకింది. భోపాల్‌లోని ఎయిమ్స్‌ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అనంతరం తండ్రీకూతుళ్లకు పలుమార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్‌ వచ్చింది. దీంతో వారిద్దరిని శుక్రవారం రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. 

జర్నలిస్టు కూతురు లండన్‌లో పోస్టు గ్రాడ్యుయేట్‌ చదువుతోంది. మార్చి 18న లండన్‌ నుంచి ఢిల్లీ మీదుగా భోపాల్‌కు ఆమె చేరుకుంది. మార్చి 21న ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అంతే కంటే ముందు రోజు మార్చి 20న ఆమె తండ్రి.. మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఇక జర్నలిస్టు బిడ్డకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని తర్వాత తెలియడంతో సీఎంతో పాటు ఆ మీడియా సమావేశానికి హాజరైన వారందరూ ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత జర్నలిస్టుకు టెస్టులు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. మిగతా జర్నలిస్టులకు ఈ వైరస్‌ వ్యాపించలేదు. మొత్తానికి తండ్రీకూతుళ్లు ఈ వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 


logo